News17th Jul 04:38 PMSunil Byrisetty1 min read

దశాబ్దాల నిరీక్షణకు తెర

రాష్ట్ర విభజన అనంతరం దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు రికార్డుల సమస్యకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వద్ద

దశాబ్దాల నిరీక్షణకు తెర
రాష్ట్ర విభజన అనంతరం దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు రికార్డుల సమస్యకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 79 బండిళ్లలోని 3,503 ఫైళ్లు, 4,050 సర్వే కమిషనర్ నివేదికలు, రెండు అధికారిక గెజెట్ సంపుటాలు మరియు ఇతర అత్యంత విలువైన చారిత్రాత్మక రికార్డులను తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు అప్పగించింది. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఇది కేవలం రికార్డుల బదిలీ కాదని, వక్ఫ్ ఆస్తుల హక్కులను పరిరక్షించే కీలక ఆధారాలు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి లభించిన చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ రికార్డుల లభ్యత లేకపోవడంతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, యాజమాన్య హక్కుల నిర్ధారణ, ఆక్రమణల తొలగింపు, న్యాయపరమైన వ్యవహారాల నిర్వహణ వంటి అనేక కీలక అంశాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడం తన బాధ్యతగా భావించి, చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి సాధించామని తెలిపారు.
Andhra Pradesh Waqf Board
Telangana Waqf Board
Waqf Records
Abdul Aziz
State Bifurcation
Waqf Properties
వక్ఫ్ ఆస్తులు
చారిత్రాత్మక రికార్డులు
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ప్రభుత్వ రికార్డులు
Scroll for the next article