News4th Dec 04:47 PMSunil Byrisetty1 min read

పాలనా వికేంద్రీకరణతోనే ప్రజలకు న్యాయం

పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తోందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు అన్నారు. నర్సీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేస

పాలనా వికేంద్రీకరణతోనే ప్రజలకు న్యాయం
పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తోందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు అన్నారు. నర్సీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'డివిజనల్ అభివృద్ధి అధికారి'(డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ - DDO) కార్యాలయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు రిబ్బన్ కట్ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. గతంలో పంచాయతీలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా జిల్లా కేంద్రాలకు, జెడ్పీ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు డివిజన్ స్థాయిలోనే కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు, సర్పంచులకు ఎంతో సమయం ఆదా అవుతుందని అన్నారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్నందుకు డిప్యూటీ సీఎంకి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో సమితులు ఉన్నప్పుడు జరిగిన ప్రమోషన్ల తర్వాత, మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవతో అధికారులకు ప్రమోషన్లు రావడం శుభపరిణామమని, దీనిపై అధికారులంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
Andhra Pradesh Governance
Public Administration
Decentralization
Ayannapatrudu
Pawan Kalyan
Panchayati Raj
Divisional Development Office
గ్రామీణ అభివృద్ధి
ప్రజా పరిపాలన
నర్సీపట్నం
Scroll for the next article