News20th Sep 01:26 PMSunil Byrisetty1 min read
కేంద్రం నుంచి లక్ష కోట్లు రాబట్టాలి
ఎల్ నినో విపత్తు నేపథ్యంలో తక్షణమే కరువు ప్రాంతాలను ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా భావించి, కేంద్రం
ఎల్ నినో విపత్తు నేపథ్యంలో
తక్షణమే కరువు ప్రాంతాలను ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా భావించి, కేంద్రం నుండి లక్ష కోట్లు సహాయం రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులకు పంట నష్ట పరిహారం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు బీమా అమలు చేయాలని, బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. ఉపాధి పనులు చూపాలని, పశువులకు మేత కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గడచిన 30 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతటి విపత్కర కరువు పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని, ఎల్ నినో గురించి వాతావరణ శాస్త్రవేత్తలు ముందు నుండి హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 55% లోటు వర్షపాతం నమోదు కాగా రాయలసీమలో 65%, అన్నమయ్య జిల్లాలో 70% లోటు వర్షపాతం ఉందని వివరించారు.