News24th Sep 12:08 PMSunil Byrisetty1 min read
కరువు ప్రాంతాల ప్రకటన చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాల ప్రకటన చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. కరువును జాతీయ విపత్తుగా గుర్తించి, లక్ష కోట్లు విడుదల చేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాల ప్రకటన చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. కరువును జాతీయ విపత్తుగా గుర్తించి, లక్ష కోట్లు విడుదల చేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులను నిర్థిష్టంగా పరిశీలించాలని పేర్కొంది. మండలం, గ్రామం యూనిట్‌గా కరువును గుర్తించాలని కోరింది. కరువు సహాయక చర్యలకు నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టాలని, పంటలు వేసి నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.40,000లు, ఏపంట వేయని రైతులకు ఎకరాకు రూ.15,000లు నష్టపరిహారం ఇవ్వాలి. మేత సరఫరా చేయాలనే డిమాండ్లు ప్రభుత్వం ముందుంచింది. . ఇన్‌పుట్ సబ్సిడీ, రైతులు, కౌలు రైతులకు పంట నష్టపరిహారం, రైతుల రుణమాఫీ, అన్ని పంటలకు బీమా అమలు, త్రాగునీరు, ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్‌ప్లాన్ అమలు చేయాలని సూచించింది. ఎరువుల యాప్‌ను మార్చాలి. లేదా రద్దు చేయాలని డిమాండ్ చేసింది.