News15th Aug 05:02 PMSunil Byrisetty1 min read

ఆక‌ట్టుకున్న అలంకృత శ‌క‌టాలు

80వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా విజ‌య‌వాడ మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియంలో జ‌రిగిన ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి వేడుక‌ల్లో వివిధ శాఖ‌ల అలంకృత శ‌క‌టాలు ఆక‌ట్టుకున్నాయి. మొత్తం 16

ఆక‌ట్టుకున్న అలంకృత శ‌క‌టాలు
80వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా విజ‌య‌వాడ మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియంలో జ‌రిగిన ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి వేడుక‌ల్లో వివిధ శాఖ‌ల అలంకృత శ‌క‌టాలు ఆక‌ట్టుకున్నాయి. మొత్తం 16 శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించ‌గా ఇవి ఆయా శాఖలు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, వినూత్న కార్యక్రమాలను ప్రతిబింబించేలా సృజనాత్మకంగా రూపుదిద్దుకున్నాయి. దేవాదాయ ధ‌ర్మాదాయ‌, అగ్నిమాప‌క‌, పంచాయ‌తీరాజ్‌-గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా జ‌ల నిర్వ‌హ‌ణ సంస్థ - ఇరిగేష‌న్, మ‌హిళాభివృద్ధి, వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయ వాణిజ్యం, ఉద్యాన‌-ఏపీ ఎంఐపీ, ప‌శుసంవ‌ర్థ‌క శాఖ, పౌర స‌ర‌ఫ‌రాలు, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యం, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ, ర‌వాణా, ప్ర‌జా ర‌వాణా, ప‌రిశ్ర‌మ‌లు, ఏపీఐఐసీ ఎంఎస్ఎంఈ, అట‌వీ శాఖల‌తో పాటు పోలీసు శాఖ‌కు చెందిన డ్రోన్ శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రదర్శించిన ఈ అలంకృత శకటాలు దేశభక్తి, అభివృద్ధి, ప్రజాసేవ స్ఫూర్తిని చాటుతూ వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. శ‌క‌టాల‌కు సంబంధించి మొద‌టి స్థానంలో డీఆర్‌డీఏ - రైజ్ కేంద్రం శ‌క‌టం నిల‌వ‌గా రెండో స్థానంలో వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయ వాణిజ్యం శ‌క‌టం నిలిచింది. మూడో స్థానంలో ఉద్యాన‌, ఏపీ సూక్ష్మ సేద్య ప‌థ‌కం, ప‌శు సంవ‌ర్థ‌క శాఖ శ‌క‌టం నిలిచింది.
Andhra Pradesh
NTR District
Vijayawada
Independence Day
80th Independence Day
Decorated Tableaux
Government Departments
అభివృద్ధి కార్యక్రమాలు
ప్రజాసేవలు
డీఆర్‌డీఏ
వ్యవసాయం
ఉద్యానవనం
పోలీసు శాఖ
Scroll for the next article