News16th Dec 09:34 AMSunil Byrisetty1 min read
పొగమంచు ఎఫెక్ట్.. ఢిల్లీలో ఘోరం!
ఢిల్లీలో పొగమంచు ప్రమాదాలకు దారితీస్తోంది. ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు బస్సుల్లో
ఢిల్లీలో పొగమంచు ప్రమాదాలకు దారితీస్తోంది. ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులతో పాటు సమీపంలో ఉన్న కొన్ని ఇతర వాహనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదం కారణంగా ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.