News10th Dec 03:42 PMSunil Byrisetty1 min read

ఇండిగో విమానాల రద్దు అంశంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఇండిగో విమానాల రద్దు అంశంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇండిగో ఘటన వల్ల దేశ ఆర్థిక

ఇండిగో విమానాల రద్దు అంశంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఇండిగో విమానాల రద్దు అంశంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇండిగో ఘటన వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయిందని పేర్కొంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సంక్షోభ సమయంలో ఇతర సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు ఎలా పెంచుతాయని నిలదీసింది. ఇండిగో వ్యవహారంపై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్న కేంద్రం.. ఇండిగో సంస్థకు ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని వాదన వినిపించింది. అలాగే విమానాల రద్దుపై ఇండిగో ఇప్పటికే క్షమాపణలు చెప్పిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
IndiGo
Delhi High Court
Flight Cancellations
Aviation Crisis
Airfare Hike
Show-Cause Notice
Indian Aviation
Passengers Issues
Economic Impact
Government Response
IndiGo Apology
Legal Action
DGCA
Airlines Regulation
Scroll for the next article