News2nd Dec 04:23 PMSunil Byrisetty2 min read
ఢిల్లీలో అమిత్ షా, శివరాజ్ సింగ్ తో భేటీలు!
మొంథా తుపాను నష్టం: రూ. 6,352 కోట్లు – కేంద్రానికి నివేదికలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో: రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత, రామ్మోహన్ (కేంద్ర మంత్రి), ఎంపీలు భేటీ అయ్యి తుపాను వల
మొంథా తుపాను నష్టం: రూ. 6,352 కోట్లు – కేంద్రానికి నివేదికలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో: రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత, రామ్మోహన్ (కేంద్ర మంత్రి), ఎంపీలు భేటీ అయ్యి తుపాను వల్ల సంభవించిన మొత్తం నష్టంపై నివేదికను సమర్పించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో వ్యవసాయ రంగానికి జరిగిన తీవ్ర నష్టాన్ని ప్రత్యేకంగా వివరిస్తూ మరో నివేదిక అందజేశారు.
తుపాను ప్రభావం – రాష్ట్రంలో భారీ నష్టం
* మొత్తం నష్టం: రూ. 6,352 కోట్లు, ప్రభావిత గ్రామాలు: 3,109
* ప్రభావిత ప్రజలు: సుమారు 9.53 లక్షలు
* తరలింపు: 2,471 పునరావాస శిబిరాలకు 1.92 లక్షల మంది తరలింపు.
* తక్షణ సహాయం: ప్రతి కుటుంబానికి రూ. 3,000 చొప్పున పంపిణీ; మొత్తం రూ. 60 కోట్ల ఆర్థిక సహాయం.
* తక్షణ ఉపశమనం: రూ. 902 కోట్లు
రంగాల వారీగా నష్టాల విభజన
* రహదారులు, మౌలిక సదుపాయాలు: రూ. 4,324 కోట్లు (అత్యధిక నష్టం)
* శాశ్వత నిర్మాణాలకు: రూ. 1,302 కోట్లు
* నీటి వనరులు, నీటిపారుదల: రూ. 369 కోట్లు
* వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ. 271 కోట్లు
* సామూహిక ఆస్తులు: రూ. 48 కోట్లు
* విద్యుత్ రంగానికి: రూ. 41 కోట్లు
వ్యవసాయం, ఉద్యాన రంగంపై ప్రభావం
* పంట నష్టం: సుమారు 1.61 లక్షల హెక్టార్లలో వరి, మక్కజొన్న, పత్తి వంటి పంటలు దెబ్బతిన్నాయి.
* ప్రభావిత రైతులు: 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారు.
* ఉత్పత్తి నష్టం: సుమారు 4.36 లక్షల మెట్రిక్ టన్నులు.
* ఉద్యాన పంటలు: 6,250 హెక్టార్లలో (33% కంటే అధికం) అరటి, బొప్పాయి, కొబ్బరి, పసుపు, మిరప, కూరగాయలు, పూలు దెబ్బతిన్నాయి.