National9th Oct 12:41 PMSunil Byrisetty1 min read
ఢిల్లీలో హైఅలర్ట్!
ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. రేపు CJP నిరసనలతో ఢిల్లీలో పటిష్ట భద్రత, భారీగా బలగాల మోహరించారు. ఛత్తీస్ గఢ్, బెంగాల్ నుంచి 7వేల మంది CRPF సిబ్బంది ఢిల్లీకి తరలించారు. అత్యాధునిక ANT
ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. రేపు CJP నిరసనలతో ఢిల్లీలో పటిష్ట భద్రత, భారీగా బలగాల మోహరించారు. ఛత్తీస్ గఢ్, బెంగాల్ నుంచి 7వేల మంది CRPF సిబ్బంది ఢిల్లీకి తరలించారు. అత్యాధునిక ANTI-RIOT ఆయుధాలతో సన్నద్ధమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల పర్యటనలు రద్దు చేసుకున్న భద్రతా పరిస్థితిని హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జంతర్ మంతర్‌లో CJP నిరసనకు పోలీసుల అనుమతి నిరాకరించారు. CEC జ్ఞానేష్‌కుమార్ రాజీనామా డిమాండ్‌తో.. తలపెట్టిన ఆందోళనకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. జంతర్ మంతర్ దగ్గర BNSS సెక్షన్ 163 అమలు చేయడంతోపాటు నేడు, రేపు ఢిల్లీలో మద్యం దుకాణాలు బంద్ కు ఆదేశించారు. ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసుల తనిఖీలు నిర్వహిస్తూ, వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వస్తున్న ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్నారు.