National11th Nov 10:09 AMSunil Byrisetty1 min read

ఉగ్ర కుట్ర వెనుక హైదరాబాద్‌ డాక్టర్‌?

ఢిల్లీలో బాంబు పేలుడు 8 మంది ప్రాణాలు హరించడంతోపాటు పదుల సంఖ్యలో ప్రజలను గాయాలపాలు చేసింది. ఈ కుట్ర వెనుక స్వయంగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఉన్నట్లు తె

ఉగ్ర కుట్ర వెనుక హైదరాబాద్‌ డాక్టర్‌?
ఢిల్లీలో బాంబు పేలుడు 8 మంది ప్రాణాలు హరించడంతోపాటు పదుల సంఖ్యలో ప్రజలను గాయాలపాలు చేసింది. ఈ కుట్ర వెనుక స్వయంగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ ఏటీఎస్ అధికారులు అందించిన వివరాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. మొహియుద్దీన్ సయ్యద్ (35), తన ఇంటిని ఏకంగా రహస్య ల్యాబ్‌గా మార్చుకున్నాడు. అక్కడ అతను ఆముదం గింజలను ప్రాసెస్ చేసి, వాటి వ్యర్థాల నుంచి అత్యంత ప్రమాదకరమైన 'రైసిన్'విషరసాయనాన్ని తయారు చేయడానికి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. నిపుణుల ప్రకారం, రైసిన్ అనేది అతి తక్కువ మోతాదులోనూ ప్రాణాలను తీయగలిగే అత్యంత శక్తిమంతమైన విష రసాయనం. మోహియుద్దీన్ తన ఉగ్ర కార్యకలాపాల కోసం రద్దీగా ఉండే ప్రాంతాలనే లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఢిల్లీ ఆజాద్‌పూర్ మండీ (మార్కెట్),అహ్మదాబాద్ నరోడా ఫ్రూట్ మార్కెట్, లఖ్‌నవూ ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీసు, ఈ ప్రాంతాల్లో జనం రద్దీ అధికంగా ఉండటంతో, పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలిగించడానికి అనువైన అవకాశముందని నిందితుడు భావించినట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డీఐజీ సునీల్ జోషి మీడియాకు తెలిపారు.
India News
Crime Investigation
Terror Plot
Hyderabad Doctor
Delhi Blast
Ricin Poison
Gujarat ATS
Ahmed Mohiuddin Syed
Terrorism Investigation
Chemical Weapon
National Security
Anti Terrorist Squad
Delhi Explosion
Ahmedabad
Lucknow
Scroll for the next article