National13th Dec 03:05 PMSunil Byrisetty1 min read

జనగణన తర్వాత డీలిమిటేషన్!

కరోనా కారణంగా సుదీర్ఘంగా వాయిదా పడిన జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం జనగణన నిర్వహణకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు రూ.12 వేల కోట్ల బడ్జెట్ కేటా

జనగణన తర్వాత డీలిమిటేషన్!
కరోనా కారణంగా సుదీర్ఘంగా వాయిదా పడిన జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం జనగణన నిర్వహణకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు రూ.12 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ, పూర్తిగా డిజిటల్ విధానంలో, తక్కువ సమయంలో, తప్పుల్లేకుండా జనగణన పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుత సాంకేతికతతో నెలల తరబడి సాగే పాత పద్ధతులకు ముగింపు పలకాలని కేంద్రం భావిస్తోంది. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా జరగనుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న క్యాప్ వచ్చే ఏడాదితో ముగియనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పునర్విభజన చేయాల్సి ఉంటుంది.
Government of India
Census
Digital Census
Caste Census
Delimitation
Constituency Reorganisation
కేంద్ర ప్రభుత్వం
రాజ్యాంగ నిబంధనలు
బడ్జెట్ కేటాయింపు
ఎన్నికల సరిహద్దులు
Scroll for the next article