News23rd Sep 04:36 PMSunil Byrisetty1 min read

పదవులలో కాదు.. హామీల అమలులో 100% సాధించండి

ముఖ్యమంత్రి, కూటమి నేతలు స్థానిక ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించడానికి ప్రకటనలు చేస్తున్నారు తప్ప, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని సీపీఎం నేత బాబురావు విమర్శించారు. వేలకోట్ల

పదవులలో కాదు.. హామీల అమలులో 100% సాధించండి
ముఖ్యమంత్రి, కూటమి నేతలు స్థానిక ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించడానికి ప్రకటనలు చేస్తున్నారు తప్ప, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని సీపీఎం నేత బాబురావు విమర్శించారు. వేలకోట్ల రూపాయలతో నగరాలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలలోనే తప్ప వాస్తవంలో చిత్తశుద్ధి లేదన్నారు. విజయవాడ నగర అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. వాంబే కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు గడిచినా, అప్పటినుండి హామీలు ఇస్తున్న పాలకులు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం జరగకపోవడం వలన దాదాపు 5 వేల మంది ప్రజలపై ఒక్కొక్కరికి నెలకు 600 నుండి 1000 రూపాయలు అదనపు భారం రవాణా చార్జీల రూపంలో పడుతుందని, గత 20 సంవత్సరాల కాలంలో దాదాపు 100 కోట్ల రూపాయల భారం పడిందని వివరించారు.
Scroll for the next article