News21st Dec 05:04 PMSunil Byrisetty1 min read

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ప్రభుత్వ విభాగాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడం, సమాన పనికి సమాన వేతనం విధానాన్ని అమలు చేయడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుక

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ప్రభుత్వ విభాగాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడం, సమాన పనికి సమాన వేతనం విధానాన్ని అమలు చేయడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సంఘటిత కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందని సంఘ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ తెలిపారు. విజయవాడలోని ఎన్జీజిఓ హోమ్ లో ఆదివారం జరిగిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అలపర్తి విద్యాసాగర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను ప్రభుత్వం యధాతధంగా అమలు చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. చాలీచాలని జీతాలు, పని భారం వంటి తీవ్రమైన సమస్యలతో సతమతం అవుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి 151 జీవో ద్వారా 50% పెంచిందని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బడ్జెట్ తో సంబంధం లేకుండా ఒకటో తారీఖున జీతాలు వచ్చే ఏర్పాటు చేసిందని దానికి ఏపీ ఎన్జీవో కృషి కారణమని తెలిపారు. వారికి కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని, ఈ విషయమై ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం ప్రభుత్వ గుర్తుంచుకోవాలన్నారు.
AP Government
Employee Welfare
Outsourcing Employees
Job Security
Equal Pay for Equal Work
Supreme Court Guidelines
ఉద్యోగుల సంక్షేమం
రాష్ట్ర కార్యవర్గ సమావేశం
విజయవాడ
Scroll for the next article