Crime27th Mar 08:43 AMSunil Byrisetty1 min read
డైట్ స్టూడెంట్‌కు వేధింపులు.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్..
కృష్ణా జిల్లా అంగలూరులోని జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్)లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ విద్యార్థినిని వేధిస్తున్నట్లు గుర్తించి చర్యలు తీసుకున్నారు. డైట్ కళ
కృష్ణా జిల్లా అంగలూరులోని జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్)లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ విద్యార్థినిని వేధిస్తున్నట్లు గుర్తించి చర్యలు తీసుకున్నారు.
డైట్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థిని ఒకరు ఆవరణలోని వసతి గృహంలో ఉంటున్నారు.
డిప్యుటేషన్‌పై పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ కె.హరికిరణ్ 20 రోజులుగా ఆమెను వేధిస్తున్నారు.
విద్యార్థినితో అనుచిత సంభాషించడం, ప్రవర్తించడం, ఆడియో, వీడియో కాల్స్ చేయడం, ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడడం, అభ్యంతరకర సందేశాలు పంపడం చేశారు. బాధితురాలు తోటి విద్యార్థినులకు తన బాధను చెప్పుకొన్నారు.
వేధింపులను భరించలేనని, ఆత్మహత్య చేసుకుంటానని కూడా వాపోయారు.
చివరకు సహచర విద్యార్థుల సూచనలతో ఆమె ప్రిన్సిపల్‌కు హరికిరణ్ పంపిన సంభాషణలు, ఆడియో, వీడియోలను అందించారు.
ఆమె ఫిర్యాదును ప్రిన్సిపల్ నేరుగా ఉన్నతాధికారులకు అందజేశారు.
దీంతో హరికిరణ్‌ను సస్పెండ్ చేస్తూ సస్పెండ్ చేస్తూ డీఈవో రామారావు ఆదేశాలు జారీ చేశారు.
తదుపరి అతడిపై పోలీస్ కేసు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.