News25th Oct 01:03 PMSunil Byrisetty1 min read
బంగాళాఖాతంలో వాయుగుండం
బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనం బలపడింది. తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. విశాఖకు 860 కి.మీ., కాకినాడకు 950 కి.మీ బాపట్లకు 1130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్
బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనం బలపడింది. తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. విశాఖకు 860 కి.మీ., కాకినాడకు 950 కి.మీ
బాపట్లకు 1130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
నేడు తీవ్ర వాయుగుండంగా బలపడనున్నట్లు ప్రకటించింది.
రేపు తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.
ఎల్లుండి ఉదయం తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. బుధవారం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా.
ఎల్లుండి నుంచి 3 రోజులు ఏపీకి భారీ వర్ష సూచనలు ఉన్నాయి.
తీరం దాటే సమయంలో 115-125 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.