News9th Jan 05:07 PMSunil Byrisetty1 min read

పిఠాపురం ప్రజల మధ్య పవన్ కళ్యాణ్

తన నియోజకవర్గం ప్రజలని కలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణంలో క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో కా

పిఠాపురం ప్రజల మధ్య పవన్ కళ్యాణ్
తన నియోజకవర్గం ప్రజలని కలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణంలో క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో కాలినడకన ప్రజల వద్దకు వెళ్లి, వారితో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పిఠాపురం ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో పాల్గొన్న ఆయన రూ. 211 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పిఠాపురం మండల పరిధిలో రూ.9.60 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ , కోనపాపపేటలో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫిషరీస్ సెంటర్, ఉపాధి హామీ పథకం, ఆర్ అండ్ బి నిధులు, సాస్కీ నిధులతో నిర్మించనున్న రోడ్లు, గోకులాలు, వివిధ అభివృద్ధి పనులు ఉన్నాయి.
Andhra Pradesh
Pawan Kalyan
Pithapuram
Deputy Chief Minister
Field Visit
Sankranti Celebrations
Public Interaction
Grievance Redressal
ప్రజా సమస్యలు
అభివృద్ధి కార్యక్రమాలు
శంకుస్థాపనలు
పోలీస్ స్టేషన్ పరిశీలన
Scroll for the next article