News11th Jun 11:45 AMSunil Byrisetty1 min read

మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

‘పిఠాపురం నియోజక వర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను’ – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన మాట. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్

మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్
‘పిఠాపురం నియోజక వర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను’ – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన మాట. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఏడాది కాలంలోనే రూ.308 కోట్లకు పైగా నిధులను పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించారు. విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పనతోపాటు పారిశుధ్యం, సంపద సృష్టిపై దృష్టి సారించారు. పల్లె పండుగ ద్వారా పిఠాపురం పల్లెల్లో రహదారులకు కొత్త కళ వచ్చింది. గ్రామ గ్రామాన సీసీ రోడ్లు, బీటీ రోడ్లతో ప్రజలకు రహదారి కష్టాలు తీరుతున్నాయి. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని 100 పడకల ప్రాంతీయ వైద్యశాలగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ హాస్టల్స్ వసతుల కల్పనకు శ్రీకారం చుట్టి విద్యార్థినుల్లో స్థైర్యం నింపారు.
Andhra Pradesh news
pitapuram
100 bed hospitals inaugurated
infrastructure development
support formers
ఏడాది కాలంలో రూ. 308 కోట్ల అభివృద్ధి పనులు
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
Scroll for the next article