News22nd Jan 02:55 PMSunil Byrisetty1 min read
కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. కోటప్పకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు విచ్చేసిన ఆయన త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. కోటప్పకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు విచ్చేసిన ఆయన త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పాదాభిషేక సేవలో పాల్గొన్నారు. అర్చక స్వాములు మేధా దక్షిణామూర్తి స్వరూపుడైన కోటయ్య స్వామికి పాదాభిషేకం చేసి, పుణ్య జలాన్ని శిరస్సుపై చల్లారు. పవన్ కళ్యాణ్ స్వామి వారికి పట్టు వస్త్రాలు, ఫల ప్రసాదం సమర్పించారు. పాదాభిషేకానంతరం పవన్ కళ్యాణ్ కి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. సంప్రదాయబద్దంగా తలపాగా చుట్టగా, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఉత్తరద్వారం నుంచి లోనికి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా పాదాభిషేకాదులు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తోపాటు ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, స్థానిక శాసన సభ్యులు డా. చదలవాడ అరవింద్ బాబు, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ తదితరులు స్వామివారి పూజలో పాల్గొన్నారు.