News20th Mar 10:27 AMSunil Byrisetty1 min read

మీ తమ్ముడిగా పుట్టినందుకు.. పవన్‌ కళ్యాణ్ ఎమోషనల్!

మెగాస్టార్ చిరంజీవిని యూకేలో సత్కరించడంపై ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. యూకేలో చిరంజీవికి లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ప్రదానం చేయడంపై భావోద్వేగానికి గుర

మీ తమ్ముడిగా పుట్టినందుకు.. పవన్‌ కళ్యాణ్ ఎమోషనల్!
మెగాస్టార్ చిరంజీవిని యూకేలో సత్కరించడంపై ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. యూకేలో చిరంజీవికి లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ప్రదానం చేయడంపై భావోద్వేగానికి గురయ్యారు. అవార్డుపై చిరంజీవి సోదరుడిగా పవన్‌ కళ్యాణ్ స్పందించారు. 'మీ తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య గారి కీర్తిని మరింత పెంచనుంది. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో అన్నాదమ్ముల అనుబంధం గొప్పదంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
Pawan Kalyan
Chiranjeevi
UK
లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌
Scroll for the next article