News29th Jul 05:19 PMSunil Byrisetty1 min read

ఏనుగులు వస్తాయి.. అప్రమత్తం చేయాలి

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. అటవీ శా

ఏనుగులు వస్తాయి.. అప్రమత్తం చేయాలి
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఏనుగుల గుంపుల సంచారం, పంట పొలాలను ధ్వంసం చేయడం, ఏనుగుల దాడిలో ఇటీవల ఒక రైతు దుర్మరణంపై సమీక్షించారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏనుగుల గుంపు తిరుగుతూ పొలాలు ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు వివరాలు అందించారు. 11 ఏనుగులు (ఇందులో నాలుగు ఏనుగులు పిల్లలు) ఒక గుంపుగా తిరుగుతూ కళ్యాణి డ్యామ్ సమీపంలోని సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర పొలాలు, తోటలు తొక్కివేశాయని వివరించారు. డ్రోన్ ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఏనుగులు ఎటువైపు వెళ్తున్నాయి అనేది పరిశీలించి, అవి వెళ్ళే అవకాశం ఉన్న మార్గాల్లోని గ్రామాలవారిని అప్రమత్తం చేయడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. గ్రామాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ముందస్తు హెచ్చరికలు పంపించాలని ఆదేశించారు.
Andhra Pradesh news
Pawan Kalyan
Chittoor Elephants
Tirupati Forest Department
Elephant Attack
Crop Damage
Drone Monitoring
Forest Surveillance
WhatsApp Alert Groups
కళ్యాణిడ్యామ్
డ్రోన్‌నిఘా వాట్సాప్‌హెచ్చరికలు
Scroll for the next article