News10th Dec 03:54 PMSunil Byrisetty1 min read

పదివేల మందికి పదోన్నతులు: డిప్యూటీ సీఎం పవన్

పల్లెలే దేశానికి వెన్నెముక అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో ఆయన మాటామంతీ నిర్వహించారు. ఉద్యోగులు

పదివేల మందికి పదోన్నతులు: డిప్యూటీ సీఎం పవన్
పల్లెలే దేశానికి వెన్నెముక అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో ఆయన మాటామంతీ నిర్వహించారు. ఉద్యోగులు శాఖాపరమైన సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడారు. “పల్లెల కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు ఇవ్వకపోవడం సరికాదనిపించింది. గత ప్రభుత్వంలో ప్రతి పోస్టుకు, బదిలీకి ఓ రేటు పెట్టారు. ఈ పద్ధతిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పాను. పనులు చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లుల చెల్లింపు చేయాలని ఆదేశించాను. పంచాయతీరాజ్ అనుబంధ శాఖల్లో 2లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. సీనియారిటీ, సిన్సియారిటీ, పనితీరు ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని అధికారులకు చెప్పా. 10 వేల మందికి పదోన్నతులు కల్పించాం. పదోన్నతి వచ్చిన ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. జీతాలు ఇంకా పెరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి. ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి పెట్టాలి. శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ, వెంకటకృష్ణ వంటి అధికారుల కృషి ప్రశంసనీయం. నా తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగే.. అందుకే ఉద్యోగులపై సానుకూల భావన ఉంది” అని పవన్ అన్నారు.
AP Governance
Pawan Kalyan
Deputy CM
Andhra Pradesh
Panchayat Raj
Employee Promotions
Rural Development
Government Employees
Mangalagiri
శశిభూషణ్ కుమార్
కృష్ణతేజ
వెంకటకృష్ణ
ఏపీ ప్రభుత్వం
ఉద్యోగుల సమస్యలు
Scroll for the next article