News22nd Jan 12:28 PMSunil Byrisetty1 min read

కార్యకర్త కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అండ

కృష్ణా జిల్లాలోని పెడన నియోజక వర్గం, పెదచందాల గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర

కార్యకర్త కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అండ
కృష్ణా జిల్లాలోని పెడన నియోజక వర్గం, పెదచందాల గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు ఆర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుడి కుటుంబ సభ్యులకు పవన్ ధైర్యం చెప్పారు. క్రియాశీలక కార్యకర్త రాయల్ కుటుంబానికి 5 లక్షల చెక్ అందించారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అవయవ దానం చేసిన ఘటన నన్ను ఎంతో చలించింది.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.. గుండె ధైర్యం చేసుకుని అవయవ దానం చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. వసంతరాయలు కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఆ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయికి వినికిడి సమస్య ఉంది.. ఆ సమస్యను టీటీడీ శ్రవణం పథకం ద్వారా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
Andhra Pradesh
Pawan Kalyan
Deputy Chief Minister
Jana Sena Party
Krishna District
Pedana Constituency
కార్యకర్త కుటుంబానికి సహాయం
అవయవ దానం
టీటీడీ శ్రవణం పథకం
Scroll for the next article