News11th Oct 04:12 PMSunil Byrisetty1 min read
అడవి బాట పట్టిన ఉప ముఖ్యమంత్రి
డోలీ రహిత గిరిజన గ్రామాలే లక్ష్యంగా అడవి తల్లి బాట 1.0 విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి మంత్రి పవన్ కళ్యాణ్ ‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రంపచోడవరం మ
డోలీ రహిత గిరిజన గ్రామాలే లక్ష్యంగా అడవి తల్లి బాట 1.0 విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి మంత్రి పవన్ కళ్యాణ్ ‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రంపచోడవరం మండల పరిధిలోని కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న 3.4 కిలోమీటర్ల బీటీ రహదారికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. నాలుగు గిరిజన ఆవాసాలను అనుసంధానించనున్న ఈ రహదారి నిర్మాణం పూర్తయితే సుమారు 1,400 మందికి మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. రూ. 2.29 కోట్ల అంచనా వ్యయంతో ఈ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించనున్నారు. కార్యక్రమంలో ఎంపీ ఉదయ్, ఎమ్మెల్యే నానాజీ, అధికారులు పాల్గొన్నారు.