News20th May 01:13 PMSunil Byrisetty1 min read

ఉగ్రకదలికలపై స్పెషల్ ఫోకస్.. డిప్యూటీ సీఎం పవన్ లేఖ!

రాష్ట్రంలో ఉగ్ర కదలికలు వెలుగుచూడటంతో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం

ఉగ్రకదలికలపై స్పెషల్ ఫోకస్.. డిప్యూటీ సీఎం పవన్ లేఖ!
రాష్ట్రంలో ఉగ్ర కదలికలు వెలుగుచూడటంతో అంతర్గత భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని, తీర ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేశ భద్రత, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నింటిలో ఉగ్రవాదం కదలికలు, వారి సానుభూతిపరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు. విజయనగరంలో ఒక యువకుడికి ఐ.ఎస్.తో సంబంధాలున్నాయని, పేలుళ్లకు కుట్ర పన్నిన తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలను గుర్తించి అరెస్టు చేసిన మన రాష్ట్ర పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాలన్నారు. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల పరిధిలో ఈ తరహా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
Andhra Pradesh
Pawan Kalyan
DGP on terrorist activities
Operation Sindoor
డీజీపీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ
ఉగ్రవాదం కదలికలు
Scroll for the next article