News29th Aug 03:11 PMSunil Byrisetty1 min read
రుషికొండకు డెప్యూటీ సీఎం పవన్!
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. సేనతో సేనాని పేరిట జనసేన నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విశాఖ చేరుకున్నారు. రుషికొండకు వెళ్లిన పవన్ మాట్లాడుతూ ర
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. సేనతో సేనాని పేరిట జనసేన నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విశాఖ చేరుకున్నారు. రుషికొండకు వెళ్లిన పవన్ మాట్లాడుతూ రెండు బ్లాక్ లకి మాత్రమే 90 కోట్లు, ఒకదానికి 70 కోట్లు ఒకదానికి ఖర్చు చేశారని తెలిపారు. 7 బ్లాక్ లకి 4 మాత్రమే కట్టారని, రూ. 454 కోట్లతో 4 బ్లాక్ లకు ఖర్చు చేశారని చెప్పారు. గతంలో తమను రానివ్వలేదని, ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు. గతంలో రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి 7 కోట్లు ఆదాయం ఉండేదని, ప్రస్తుతం కేవలం కరెంట్ బిల్లు సంవత్సరానికి 15 లక్షలు అవుతుందని పేర్కొన్నారు. దీనిని టూరిజం కింద ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నామని పవన్ తెలిపారు.