News24th Apr 04:01 PMSunil Byrisetty1 min read
స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలి
‘గ్రామ పంచాయతీలు బలంగా ఎదగాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమన్వయంతో ఐక్యంగా పని చేయాలి. అన్ని రంగాల్లో స్వయం ప్రతిపత్తిని సాధించాలి. అభివృద్ధి, ఆకాంక్షలు కలగలిపి స్వర్ణ గ్రామాలుగా వెల
‘గ్రామ పంచాయతీలు బలంగా ఎదగాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమన్వయంతో ఐక్యంగా పని చేయాలి. అన్ని రంగాల్లో స్వయం ప్రతిపత్తిని సాధించాలి. అభివృద్ధి, ఆకాంక్షలు కలగలిపి స్వర్ణ గ్రామాలుగా వెలగాలి’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి మాటకు అనుగుణంగా పల్లెలు జాతీయ సమగ్రతకు, సుస్థిరతకు కూడా మూల కేంద్రాలు కావాలి అన్నారు. స్థానిక సంస్థలు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించి స్థానిక ప్రభుత్వాలుగా మారేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.