News20th Jul 01:04 PMSunil Byrisetty1 min read

ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ముంబైలో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత హైదరాబాద్ నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా ఆపరేషన్ తర్వాత తొలిసారి

ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ముంబైలో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత హైదరాబాద్ నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా ఆపరేషన్ తర్వాత తొలిసారి సోమవారం ఏపీకి వచ్చారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఉన్నతాధికారులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న పవన్ ను చూసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో పలుచోట్ల కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. పార్టీ నేతలతో సమావేశమై పిఠాపురం పర్యటన గురించి ప్రకటించనున్నట్లు సమాచారం.
Andhra Pradesh
Gannavaram Airport
Pawan Kalyan
Deputy Chief Minister
జనసేన
మంగళగిరి
పిఠాపురం
ఏపీ రాజకీయాలు
Scroll for the next article