News29th Oct 11:56 AMSunil Byrisetty1 min read

'మొంథా' తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

మొంథా తుపాను ఏపీని వణికిస్తోంది. తుపాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తుపాను ప

'మొంథా' తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష
మొంథా తుపాను ఏపీని వణికిస్తోంది. తుపాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలకు అండగా నిలవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను పరిస్థితులపై పవన్ తన కార్యాలయ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు మాట్లాడారు. ఈదురు గాలులు, కుండపోత వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్ తీగలపై పడటం, స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్, విద్యుత్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.
Andhra Pradesh
Pawan Kalyan
Deputy CM
Montha Cyclone
Cyclone Relief
Konaseema
Krishna District
Bapatla
Prakasam
Nellore
Tirupati
Disaster Management
Heavy Rains
Power Restoration
పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి
మొంథా తుపాను
సహాయక చర్యలు
Scroll for the next article