News10th Sep 04:53 PMSunil Byrisetty1 min read

పులి సంచారంపై పవన్ సమీక్ష

కాకినాడ జిల్లాలో పులి సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. పులి జనావాస ప్రాంత

పులి సంచారంపై పవన్ సమీక్ష
కాకినాడ జిల్లాలో పులి సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ సూచనలు చేశారు. అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు.. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉండాలని కోరారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం - పులికి ఎలాంటి హాని కలగకుండా చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు.
Andhra Pradesh
Wildlife
Forest Department
Pawan Kalyan
Tiger Movement
Kakinada District
Tiger Alert
Forest Border Villages
ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు
వన్యప్రాణుల రక్షణ
ప్రజల భద్రత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కాకినాడ
Scroll for the next article