News19th Sep 01:22 PMSunil Byrisetty1 min read

ప్లాస్టిక్‌ రహిత ఏపీ కోసం కృషి

ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం

ప్లాస్టిక్‌ రహిత ఏపీ కోసం కృషి
ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్‌ నియంత్రణలో ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన జీవితాల్లో ప్లాస్టిక్‌ ఓ భాగం అయిపోయిందని, అందుకే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తాం: పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. తిరుమలలో క్రమశిక్షణతో ప్లాస్టిక్‌ నిషేధం అమలు అవుతోందని, ప్లాస్టిక్‌ నియంత్రణ రాజకీయ నేతల నుంచే ప్రారంభం కావాలని కోరారు. ఫ్లెక్సీల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయిందని, ఏ చిన్న కార్యక్రమమైనా ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారని పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Plastic Free AP
Plastic Ban
Waste Management
Environment
Sustainable Living
Pawan Kalyan
Plastic Alternatives
Go Green
Eco Friendly
Tirumala
పర్యావరణ అవగాహన
ప్లాస్టిక్ నియంత్రణ
శుభ్రంగా-హరితంగా
Scroll for the next article