News6th Dec 01:58 PMSunil Byrisetty1 min read
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి
అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలి. వారి ఆదాయ మార్గాలు పెంచాలి. దానికి తగినట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని ఉప ముఖ్యమం
అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలి. వారి ఆదాయ మార్గాలు పెంచాలి. దానికి తగినట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. అటవీ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎకో టూరిజం, పర్యాటకం పెంపు వంటి కీలకమైన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని గిరిజన యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ లతో ఉప ముఖ్యమంత్రి మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో గతంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ప్రస్తుతం చిత్తూరు కలెక్టర్ గా సేవలందిస్తున్న సుమిత్ కుమార్, గతంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా పని చేస్తున్న సతీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లా అటవీ ప్రాంతంలో గంజాయి నిర్మూలన అంశంపైనా చర్చించారు.