News13th Nov 01:27 PMSunil Byrisetty1 min read

ఏనుగుల సంచారంపై పవన్ కీలక ఆదేశాలు

అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేసే ప్రక్రియను మరింత పెంచాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్య

ఏనుగుల సంచారంపై పవన్ కీలక ఆదేశాలు
అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేసే ప్రక్రియను మరింత పెంచాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటన ఉప ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. పి.సి.సి.ఎఫ్., సంబంధిత అధికారులతో గురువారం ఉదయం ఈ ఘటనపై చర్చించారు. కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని సత్వరమే అందించాలని స్పష్టం చేశారు. తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఏనుగు మూలంగా ఈ ఘటన చోటు చేసుకొందని, అక్కడ కూడా సదరు ఏనుగు మూలంగా మరణాలు సంభవించాయని అటవీ శాఖ అధికారులు వివరించారు. మన రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వస్తోందని ట్రాక్ చేసిన వెంటనే సమీప గ్రామాల వారికి ముందుగానే తెలియచేశామన్నారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘ముందస్తు హెచ్చరికలను మరింత విస్తృతం చేయండి. గ్రామాలవారీగానూ, రైతులతోనూ సోషల్ మీడియా గ్రూప్స్ ఏర్పాటు చేసి వాటికి టెక్స్ట్ మెసేజిలతోపాటు, వాయిస్ మెసేజిలు కూడా పంపిస్తే సమాచారం తొందరగా చేరుతుంది’ అన్నారు.
Andhra Pradesh
Pawan Kalyan
Forest Department
Elephant Alert
Wildlife Conservation
Human-Wildlife Conflict
పర్యావరణ పరిరక్షణ
కుప్పం
అటవీ ప్రాంతం
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article