News2nd Jul 05:31 PMSunil Byrisetty1 min read
మార్కాపురంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్కాపురంలో పర్యటించనున్నారు. ఈ నెల 4వ తేదీన నరసింహపురంలో తాగు నీటి పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్కాపురంలో పర్యటించనున్నారు. ఈ నెల 4వ తేదీన నరసింహపురంలో తాగు నీటి పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. జిల్లాకు సంబంధించి రూ.1290 కోట్ల విలువైన అతి పెద్ద తాగు నీటి పథకం పనులకు నరసింహపురం గ్రామంలో శంకుస్థాపన చేస్తారు. ఈ పథకంతో 10 లక్షల మందికి తాగు నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించారు. అనంతరం ఉదయం 10 గం.కి నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన, జనసేన పాత్ర తదితర అంశాలపై మాట్లాడనున్నారు.