Politics16th Aug 09:25 AMSunil Byrisetty1 min read

జగన్.. జెండా ఎగరేశారా?

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాకు వందనం చేయకపోవడంపై మాజీ సీఎం జగన్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమిని అంగీ

జగన్.. జెండా ఎగరేశారా?
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాకు వందనం చేయకపోవడంపై మాజీ సీఎం జగన్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమిని అంగీకరించలేని వైఖరి సరికాదని హితవు పలికారు. సుఖదుఃఖాలకు అతీతంగా ఉండేవాడే స్థితప్రజ్ఞుడని భగవద్గీత సారాంశాన్ని గుర్తు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి బోధనల గురించి ప్రస్తావించారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ వైఖరిని అందరూ అనుసరించాలని రఘురామ కోరారు.
Andhra Pradesh news
politics
Raghurama Krishnam Raju
Jagan Mohan Reddy
Independence Day
National Flag
Criticism
జాతీయ జెండా అవమానం
డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలు
Scroll for the next article