News24th Sep 10:31 AMSunil Byrisetty1 min read
దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ప్రతి నిత్యం పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. మూడో రోజైన బుధవారం అన్నపూర్ణా దేవిగా అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తున్నారు. బుధవారం డిప్యూటీ స
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ప్రతి నిత్యం పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. మూడో రోజైన బుధవారం అన్నపూర్ణా దేవిగా అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తున్నారు. బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల ఏర్పాట్లు బాగా చేశారన్నారు. పాలనలో సీఎం చంద్రబాబుకు మంచి శక్తినివ్వాలని కోరుకున్నానని తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.