News17th Sep 05:36 PMSunil Byrisetty1 min read

దేశ్ బదల్ రహా హై అంటూ హిందీలో చంద్రబాబు స్పీచ్

వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హిందీలో స్పీచ్ అదరగొట్టారు. ఆజ్ మే కాశీకే పవిత్ర ధర్తీ పర్ ఖడా హూ... యే మేరేలియే గర్వ్ కా క్షణ్ హ

దేశ్ బదల్ రహా హై అంటూ హిందీలో చంద్రబాబు స్పీచ్
వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హిందీలో స్పీచ్ అదరగొట్టారు. ఆజ్ మే కాశీకే పవిత్ర ధర్తీ పర్ ఖడా హూ... యే మేరేలియే గర్వ్ కా క్షణ్ హై అంటూ హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశ్ బదల్ రహా హై, దేశ్ ఆగే బఢ్ రహా హై అంటూ హిందీలో వ్యాఖ్యానించారు. నయా భారత్ హై.. ఆత్మ నిర్భర్ భారత్ హై అంటూ నినదించారు. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్, వికసిత్ భారత్.. యహీ హమారా సంకల్ప్ హై అంటూ ప్రసంగాన్ని ముగించారు. ప్రధాని మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు వారణాసిలో పర్యటించి, అక్కడి బహిరంగ సభకు హాజరైన వేలాది మందిని ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. కాశీ క్షేత్రం ప్రధాని నరేంద్ర మోదీ కర్మ భూమి అని, కాశీ పుణ్యక్షేత్రం నుంచి నరేంద్ర మోదీ మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారని వివరించారు. కాశీ పుణ్యక్షేత్రం దేశానికి ఓ లీడర్‌ను అందించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుస్తున్నారని కొనియాడారు.
Andhra Pradesh
Chandrababu Hindi Speech
Varanasi
Kashi
Seva Sankalp Abhiyan
Narendra Modi
PM Modi
Modi Birthday
76th Birthday
దేశ్ బదల్ రహా హై
నయా భారత్
ఆత్మనిర్భర్ భారత్
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్
Scroll for the next article