News19th Oct 01:55 PMSunil Byrisetty1 min read

'ఆధార్ మస్కట్' చేసి.. రూ.లక్ష పట్టండి!

ఆధార్ ప్రమోషన్ కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్న పోటీ నిర్వహిస్తోంది. ఆధార్ మస్కట్ ను రూపొందించేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ దేశవ్యాప్తంగా పోటీ నిర్వహిస్తోంది. కేంద్ర ప

'ఆధార్ మస్కట్' చేసి.. రూ.లక్ష పట్టండి!
ఆధార్ ప్రమోషన్ కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్న పోటీ నిర్వహిస్తోంది. ఆధార్ మస్కట్ ను రూపొందించేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ దేశవ్యాప్తంగా పోటీ నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ వేదిక MyGov ద్వారా ఔత్సాహికులను పోటీకి ఆహ్వానించింది. కొన్నిరోజుల క్రితం మొదలైన ఈ కంటెస్ట్.. అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఆధార్ ప్రధాన విలువలైన విశ్వాసం, సమగ్రత, సాధికారత, డిజిటల్ ఆవిష్కరణలు ప్రతిబింబించేలా ప్రత్యేక మస్కట్ను రూపొందించేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది.
Digital India
Aadhaar
UIDAI
MyGov
Government Contest
Mascot Design
Innovation
Empowerment
India Competition
₹1 Lakh Prize
సృజనాత్మక పోటీ
బహుమతి
యువత కోసం అవకాశాలు
Scroll for the next article