News21st Oct 04:34 PMSunil Byrisetty1 min read
దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధం..!
దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. ఏటా దసరా సందర్భంగా కర్నూలు జిల్లాలో దేవరగట్టు కర్రల సమరం జరుగుతుంది. శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం అనంతరం అర్ధరాత్రి బన్నీ ఉత్
దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. ఏటా దసరా సందర్భంగా కర్నూలు జిల్లాలో దేవరగట్టు కర్రల సమరం జరుగుతుంది. శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం అనంతరం అర్ధరాత్రి బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించే సమయంలో వాటిని దక్కించుకునే క్రమంలో కర్రల సమరం జరుగుతుంది. ఘర్షణలకు దారి తీసే ప్రమాదం ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పి విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన ఉత్సవాల్లో ఎంతోమంది తలలు పగిలి, తీవ్ర గాయాలైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.