News21st Jan 11:55 AMSunil Byrisetty1 min read

పోర్టుల్లో హైడ్రోజన్ కోపైలట్ వాహనాలను అభివృద్ధి చేయండి

స్పెయిన్ కు చెందిన ఎవల్యూషన్ సినర్జెటిక్ ఆటోమోటివ్ ఎస్ఎల్ సంస్థ ఎండీ జోస్ మెల్లాడో తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్ర

పోర్టుల్లో హైడ్రోజన్ కోపైలట్ వాహనాలను అభివృద్ధి చేయండి
స్పెయిన్ కు చెందిన ఎవల్యూషన్ సినర్జెటిక్ ఆటోమోటివ్ ఎస్ఎల్ సంస్థ ఎండీ జోస్ మెల్లాడో తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్, జీరో-ఎమిషన్ వెహికల్స్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు ఆసక్తిగా ఉంది. రాష్ట్రంలోని లైవ్ పోర్ట్ వాతావరణం, ఇండస్ట్రియల్ పార్కులు, ఇంజనీరింగ్ సాండ్‌బాక్స్‌లను అందిస్తూ ఏపీ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాకారం చేయబోతోంది. కాంప్లెక్ట్ వెహికల్స్, మొబిలిటీ సిస్టమ్స్ అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన ఎవో సంస్థ ఆధ్వర్యాన వైజాగ్/కాకినాడ పోర్టుల్లో హైడ్రోజన్ టెర్మినల్ ట్రాక్టర్స్ పైలట్‌ వాహనాలను అభివృద్ధి చేయండి. ఏపీ పారిశ్రామిక పార్కుల్లో ఎలక్ట్రిక్/హైడ్రోజన్ ఆఫ్-రోడ్ వాహనాల కోసం కో- పైలట్‌ను అభివృద్ధి చేసి, రీడిజైన్, ఆప్టిమైజేషన్ కు నేతృత్వం వహించండి. ఇందుకు అవసరమైన టెస్ట్ బెడ్ లు, అనుమతులను ఏపీ ప్రభుత్వం అందిస్తుంది.
Andhra Pradesh
Davos
Nara Lokesh
Evolution Synergetic Automotive
Green Hydrogen
Zero Emission Vehicles
విశాఖపట్నం పోర్ట్
కాకినాడ పోర్ట్
ఇండస్ట్రియల్ పార్కులు
గ్రీన్ ఎనర్జీ
ఏపీ ఐటీ శాఖ
Scroll for the next article