News31st May 05:33 PMSunil Byrisetty1 min read
అమరావతిలో అభివృద్ధి ప్రారంభం!
అమరావతి మండలం లింగాపురం గ్రామంలో 40 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ, సిసి రోడ్లను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక
అమరావతి మండలం లింగాపురం గ్రామంలో 40 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ, సిసి రోడ్లను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వివరించారు. గ్రామాల్లో రోడ్లు,డ్రైనేజీల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగు పడటంతో పాటు పర్యావరణ పరిరక్షణ మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్పష్టం చేశారు. అలాగే సమస్యలపైనా దృష్టి పెట్టినట్లు తెలిపారు.