News7th Sep 11:13 AMSunil Byrisetty1 min read

ఇన్నర్, ఔటర్ మధ్య అభివృద్ధి కారిడార్లు

రాజధాని చుట్టూ ఇన్నర్ రింగురోడ్డు, ఔటర్ రింగు రోడ్లు, రైల్వే లైన్ ఏర్పాటుతోపాటు వాటి మధ్యలో ఉండే ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి కారిడార్ గా మార్చనున్నారు. సీఆర్డీఏ 14వ అథారిటీ సమావేశ

ఇన్నర్, ఔటర్ మధ్య అభివృద్ధి కారిడార్లు
రాజధాని చుట్టూ ఇన్నర్ రింగురోడ్డు, ఔటర్ రింగు రోడ్లు, రైల్వే లైన్ ఏర్పాటుతోపాటు వాటి మధ్యలో ఉండే ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి కారిడార్ గా మార్చనున్నారు. సీఆర్డీఏ 14వ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతం అమలు చేస్తున్నారు. రాజధాని అభివృద్ధి చెందాలంటే చుట్టుపక్కల ఆర్థికపరమైన ప్రాజెక్టులు రావాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. దీనికి అనుగుణంగానే కార్యాచరణ ప్రారంభించిన ప్రభుత్వం ఈ ప్రాంతంలో 20 వరకు టౌన్ షిప్లు ఏర్పాటు చేయనుందని సమాచారం. ఇప్పటికే తాడికొండ మండలం మోతడకలో భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆయా గ్రామాల్లో రెండు మూడు దశల పూలింగులో తీసుకునే ప్రక్రియ జరుగుతోంది. కొత్తగా తాడికొండ, కంతేరు, పెదకాకాని మండలం పరిధిలోని కొప్పురావూరు గ్రామాల్లోనూ రైల్వేలైనుకు అవసరమైన భూములు తీసుకునే ప్రక్రియ సాగుతోంది. రెండు రోడ్ల మధ్యలో 20 వరకూ టౌన్ షిప్లు నిర్మించడం ద్వారా, ఆ ప్రాంతంలో భూముల విలువ పెరగడం ద్వారా పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని అప్పట్లో ప్రభుత్వం ఆలోచన చేసింది. మొత్తం 96.16 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రోడ్డు అమరావతి రాజధానికి కీలకం కానుంది. ఇన్నర్ రింగురోడ్డు నిర్మించడం ద్వారా రాజధాని పరిధిలో ఉండే 26 రోడ్లను దానికి కలపనున్నారు.
Andhra Pradesh
Amaravati Development
Inner Ring Road
Outer Ring Road
Amaravati IRR
Amaravati ORR
CRDA
Amaravati Capital
Development Corridors
భూ సమీకరణ
తాడికొండ
మోతడక
కంతేరు
పెదకాకాని
కొప్పురావూరు
రైల్వే లైన్
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article