News15th Jun 01:28 PMSunil Byrisetty1 min read
పల్నాడులో జోరుగా పొలాలు - డొంక రోడ్ల పనులు..
పల్నాడులో అభివృద్ధికి బాటలు పడుతోంది. నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవతో పల్నాడు గ్రామాల్లో పొలాలు - డొంక రోడ్ల పనులు వేగవంతమయ్యాయి. అడిగొప్పలలో 6.5 కి.మీ రోడ్ల నిర్మాణ
పల్నాడులో అభివృద్ధికి బాటలు పడుతోంది. నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవతో పల్నాడు గ్రామాల్లో పొలాలు - డొంక రోడ్ల పనులు వేగవంతమయ్యాయి. అడిగొప్పలలో 6.5 కి.మీ రోడ్ల నిర్మాణంతో దుర్గి మండలం, అడిగొప్పల గ్రామంలో మొత్తం 6.5 కిలోమీటర్ల మేర రోడ్లు, డొంకలు పునరుద్ధరణ అయ్యాయి. ఎంపీ కృష్ణ దేవరాయలు మిషనరీ (క్రేన్) పంపగా, రైతులు, నాయకులు పనులను విజయవంతంగా చేపడుతున్నారు. ఎఫ్.సి.ఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ హోదాలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవతో గ్రామీణ ప్రాంత అభివృద్ధికి చేస్తున్న కృషి ప్రజల మన్ననలు పొందుతోంది. మెరుగైన రోడ్లు, డొంకలతో రైతులకు రవాణా సౌకర్యం, వ్యవసాయ పనులకు మరింత అనుకూలంగా మారుతున్నాయి.