News28th Aug 11:39 AMSunil Byrisetty1 min read

పురపాలికల్లో అభివృద్ధి పరుగులు!

ఆంధ్రప్రదేశ్‌లోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పరుగులు తీయనుంది. ఆయా పురపాలికల్లో మౌలిక వసతుల కల్పన కోసం ₹7,469.46 కోట్ల భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన

పురపాలికల్లో అభివృద్ధి పరుగులు!
ఆంధ్రప్రదేశ్‌లోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పరుగులు తీయనుంది. ఆయా పురపాలికల్లో మౌలిక వసతుల కల్పన కోసం ₹7,469.46 కోట్ల భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ అనుమతుల్లో పలు ముఖ్యాంశాలు ఉన్నాయి. ప్రధానంగా 100% రోడ్డు అనుసంధానం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 123 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 4,388 కి.మీ రోడ్ల నిర్మాణం & అభివృద్ధి పనులకు ₹4,655.82 కోట్లు కేటాయించారు. డ్రైనేజీ వ్యవస్థతో కూడిన రోడ్ల నిర్మాణానికి ₹509.12 కోట్లు కేటాయింపు చేశారు 541 కొత్త పార్కుల అభివృద్ధి, పచ్చదనానికి ప్రాధాన్యత కింద ₹247.28 కోట్లు కేటాయించారు. 20,340 నూతన వీధి దీపాల ఏర్పాటు చేయనున్నారు. ₹87.78 కోట్లతో 1,186 కి.మీ రోడ్ మీడియన్ల సుందరీకరణ చేపట్టనున్నారు.
Andhra Pradesh
Municipalities
Municipal Corporations
Urban Development
Infrastructure Development
Road Development
Road Connectivity
పార్కుల అభివృద్ధి
పచ్చదనం
వీధి దీపాలు
రోడ్ మీడియన్లు
ఏపీ ప్రభుత్వం
పట్టణ మౌలిక వసతులు
Scroll for the next article