Spiritual12th Nov 04:53 PMSunil Byrisetty1 min read

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో అభివృద్ధి పనులు

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గుడిలో బుధవారం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి వారు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీశ్రీశ్రీ ఈశ్వ

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో అభివృద్ధి పనులు
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గుడిలో బుధవారం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి వారు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీశ్రీశ్రీ ఈశ్వరిదేవి మఠం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర శివకుమార స్వాముల వారు భక్తులు, శిష్యులు, స్థానికులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో అర్చకుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో యాగశాల, పశ్చిమ ద్వారం, దివ్యాంగులు గుడిలోకి వెళ్ళుటకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ఈ అభివృద్ధి పనులను నిర్మాణం జరుగుతుందని మఠం మేనేజర్ పల్లకొండ పెంచల నరసింహ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
Scroll for the next article