News19th Apr 10:02 AMSunil Byrisetty1 min read
కాలుష్యాన్ని తగ్గించేలా ఢిల్లీలో 'దేవి' బస్సులు
కాలుష్యంతో నరకయాతన పడుతున్న ఢిల్లీ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యరహిత ప్రయాణాన్ని అందించబోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మొహల్లా
కాలుష్యంతో నరకయాతన పడుతున్న ఢిల్లీ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యరహిత ప్రయాణాన్ని అందించబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మొహల్లా ఎలక్ట్రిక్ బస్ సర్వీస్‌ను ప్రారంభించనుంది.
అధికారికంగా ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంటర్చేంజెస్ (DEVI-దేవి)గా పిలుస్తోంది.
ఈ సేవలు ఈనెల 22 నుంచి మొదలు కానున్నాయి.
తొలి దశలో, 9 మీటర్ల పొడవు గల 255 చిన్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతారు.
ఇరుకైన వీధులు, రద్దీ ప్రాంతాల్లో సులభంగా ప్రయాణించేలా వీటిని రూపొందించారు.
దీంతో కాలుష్య ఢిల్లీలో ప్రజారవాణా కాస్త మెరుగుపడనుంది .