Spiritual28th Sep 04:51 PMSunil Byrisetty1 min read

భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యత

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తేది 11.10.2026 నుండి 20.10.2026 వరకు వైదిక కమిటీ సూచనల మేరకు శాస్త్రోక్తంగా నిర్వహించబడుతున్నాయని జిల్లా ఇంచార్జ్ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు

భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యత
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తేది 11.10.2026 నుండి 20.10.2026 వరకు వైదిక కమిటీ సూచనల మేరకు శాస్త్రోక్తంగా నిర్వహించబడుతున్నాయని జిల్లా ఇంచార్జ్ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మహోత్సవాలలో శ్రీ అమ్మవారి దర్శనం కోసం వచ్చే సాధారణ భక్తులు ఉత్సవాల అనంతరం భవానీ దీక్షల విరమణకు వచ్చే భవానీ భక్తులతో కలిపి దాదాపు 25 లక్షల మందికిపైగా తరలివచ్చే అవకాశముందని అధికారుల అంచనాను వివరించారు. ఘాట్‌రోడ్లు, పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సమన్వయం చేస్తూ పటిష్టమైన కార్యాచరణ రూపొందించామని తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు ఎండ, వర్షం తగలకుండా పూర్తిస్థాయిలో షెడ్లు, నిరంతర తాగునీటి సరఫరా, సేదతీరేందుకు కూర్చునే సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు క్యూలైన్లలో ఎంత సమయం పడుతుందో తెలియజేసేందుకు ఎల్‌ఈడీ / డిజిటల్ స్క్రీన్లను అమర్చుతున్నామని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ - చిన్ని మాట్లాడుతూ ఇంద్రకీలాద్రికి తరలివచ్చే ప్రతి సామాన్య భక్తుడూ ఎంతో సంతృప్తితో, సంతోషంగా అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని వెళ్లేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ రహిత విధానంలో, పర్యావరణహిత పద్ధతుల్లో 'బబుల్స్' ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు చెప్పారు.
Scroll for the next article