Spiritual15th Oct 11:56 AMSunil Byrisetty1 min read
కనకదుర్గమ్మకు స్వర్ణ కిరీటం
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాల వేళ జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారికి విశేష స్వర్ణ కానుక సమకూరింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన భక్తులు కూర్మినాయుడు,
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాల వేళ జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారికి విశేష స్వర్ణ కానుక సమకూరింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన భక్తులు కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె. దుర్గా శ్రీనివాస్ అమ్మవారికి సుమారు రూ. 75 లక్షల విలువైన దివ్య స్వర్ణ కిరీటాన్ని భక్తిప్రపత్తులతో సమర్పించారు.
ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన 494 గ్రాముల బరువు గల ఈ నవరత్న ఖచిత బంగారు కిరీటాన్ని దాతలు ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారివి.కె. శీనా నాయక్, దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావు సంయుక్తంగా ఈ కానుకను స్వీకరించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు అంతరాలయంలో శ్రీ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలకగా, అధికారులు శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.