TTD13th Aug 01:20 PMSunil Byrisetty1 min read
శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళం
తిరుమల తిరుపతి శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళం అందింది. బెంగళూరుకు చెందిన కె.యం.శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్
తిరుమల తిరుపతి శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళం అందింది. బెంగళూరుకు చెందిన కె.యం.శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు రూ.25 లక్షలు విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పతకాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు. బంగారు లక్ష్మీ పతకాన్ని అమ్మవారికి అలంకరించనున్నారు.