Spiritual8th Aug 03:18 PMSunil Byrisetty1 min read

వైభవంగా శ్రీ వరలక్ష్మీ పూజలు

సిరులు కురిపించే శ్రీలక్ష్మి... పసిపాపల చిరునవ్వుల్లో సంతానలక్ష్మి... ఇల్లాలి ఆలనలో గృహలక్ష్మిగా అవతరించిన మాసం... శ్రావణ లక్ష్మి ఆగమించిన మాసం లో రెండవ శుక్రవారం రోజున మహిళలు వరాల

వైభవంగా శ్రీ వరలక్ష్మీ పూజలు
సిరులు కురిపించే శ్రీలక్ష్మి... పసిపాపల చిరునవ్వుల్లో సంతానలక్ష్మి... ఇల్లాలి ఆలనలో గృహలక్ష్మిగా అవతరించిన మాసం... శ్రావణ లక్ష్మి ఆగమించిన మాసం లో రెండవ శుక్రవారం రోజున మహిళలు వరాలిచ్చే దేవత శ్రీ వరలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ పర్వదినాన అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పూజలో పాలుపంచుకుంటారు. మంగళగిరి పట్టణంలో మహిళలు తెల్లవారుజాము నుంచే స్నానాలు ఆచరించి, ఇంటి ముంగిళ్ళలో మామిడి తోరణాలు కట్టి, గుమ్మాలను పసుపు, కుంకుమలతో అలంకరించి, ఇంటి ఎదుట అందమైన రంగవల్లు వేసి శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తూ గృహాలను లక్ష్మీ నిలయాలుగా అలంకరించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో శ్రీ వరలక్ష్మీదేవి వ్రతాలు, పూజలు నిర్వహించారు. ప్రతి ఇల్లాలు సౌభాగ్య లక్ష్మిగా సుహాసినిలకు వాయన దానాలు, తాంబూలాలు అందజేసి ఆశీర్వచనాలు పొందారు. దీంతో ఆయా గృహాలు వరలక్ష్మి వ్రతాలు, పూజలు, ముత్తయిదువులతో కలకలలాడుతూ భక్తి శ్రద్ధలు, ఆనందోత్సవాలతో పండుగను వైభవంగా జరుపుకున్నారు.
Mangalagiri
Varalakshmi Vratam
Shravan Month
Lakshmi Devi
Hindu Festival
Women Devotion
Pooja Rituals
Ashta Lakshmi
వైభవంగా శ్రీ వరలక్ష్మీ పూజలు
Scroll for the next article