TTD13th Jul 11:37 AMSunil Byrisetty1 min read
కిటకిటలాడుతున్న తిరుమల
తిరుమల కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ పెరిగి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని శ్రీనివాసుడి సన్నిధికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుమలలో భక్
తిరుమల కిటకిటలాడుతోంది.
భక్తుల రద్దీ పెరిగి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
తిరుమలలోని శ్రీనివాసుడి సన్నిధికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు మొత్తం నిండిపోయాయి. వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ యాజమాన్యం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.